News November 27, 2025

విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

image

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

image

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.

News December 1, 2025

వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

image

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.