News November 27, 2025

ములుగు: సమయం లేదు మిత్రమా.. ఏం చేద్దాం..?

image

ఉత్కంఠతకు తెరదించుతూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూలు ఒకేసారి విడుదల చేసింది. ఒకరోజు వ్యవధిలోనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుండటంతో రాజకీయ పార్టీలకు ఊపిరి సలపడంలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే తర్జనభర్జన పడుతున్నారు. నామినేషన్ వేయడానికి కుల ధ్రువీకరణ, తదితర పత్రాలు అవసరం పడుతుండటంతో ఆశావహులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

Similar News

News December 1, 2025

కరీంనగర్: ప్రచారంలో అభ్యర్థుల పాట్లు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయుచున్న అభ్యర్థులు వారి గెలుపు కోసం పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ చాయ్ తాగినావా? తిన్నవా? మంచిదేనా? ఎటు పోతున్నావ్ అంటూ తదితర ముచ్చట్లు పెడుతూ చివరకు తాను గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌కు లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నానని, జర నాకు ఓటు వేసి గెలిపించండని ప్రాధేయపడుతున్నారు.

News December 1, 2025

CSIR-IHBTలో ఉద్యోగాలు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 1, 2025

AP న్యూస్ రౌండప్

image

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్‌లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆల‌యాల్లో రద్దీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి