News November 27, 2025
VKB: ఈ గ్రామంలో ఒకే ఇంటికే పల్లె పగ్గాలు!

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్‌లో పంచాయతీ రిజర్వేషన్లు ఓ కుటుంబానికే వరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ (ఎస్టీ జనరల్)తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో ఉన్న ఒక్క ఎస్టీ కుటుంబం ఎరుకలి భీమప్ప కుటుంబం మొత్తం పోటీ రంగంలో నిలబోనుంది. గ్రామంలో 494 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, ఎస్టీ వర్గానికి చెందిన భీమప్ప కుటుంబం ఒక్కటే ఉండటంతో మూడు స్థానాలకు అదే ఇంటి నుంచే అభ్యర్థులు రావడం ఖాయం.
Similar News
News November 27, 2025
పాలమూరు: సర్పంచ్‌కు నామినేషన్ వేస్తున్నారా? ఇవి తప్పనిసరి!

సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే.. 21 ఏళ్లు నిండి, గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, నేర చరిత్ర, చర/స్థిర ఆస్తుల వివరాలతో అఫిడవిట్ తప్పనిసరిగా జతపరచాలి.
News November 27, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది.
News November 27, 2025
వేములవాడ ఆలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో కేవలం శానిటేషన్ విభాగం సిబ్బందికి మాత్రమే ఈ విధానం అమలులో ఉండగా, కొత్తగా ఆలయ సిబ్బంది అందరికీ బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు వేసుకునే పద్ధతిని ప్రారంభించారు. కాగా, ఆలయ ఈవో రమాదేవి బయోమెట్రిక్ హాజరు పనిచేస్తున్న తీరును గురువారం పరిశీలించారు.


