News November 27, 2025

ADB: సం’గ్రామం’ షురూ.. మొదలైన ఎన్నికల సందడి

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకముందే పల్లెల్లో సందడి మొదలైంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోరు మరింత జోరందుకుంది. బీసీలకు కొంతమేర స్థానాలు తగ్గినప్పటికీ.. కొన్ని జనరల్ కేటగిరీ రావడంతో ఏదేమైనా పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. కులాల వారీగా అంచనాలు వేసుకుని ఏం చేస్తే బాగుంటుందని సమాలోచనలు చేస్తున్నారు. ఉమ్మడి ADBలో 1,514 పంచాయతీల్లో ఈసారి పోరు రసవత్తరంగా ఉండనుంది.

Similar News

News November 27, 2025

HYD: సమయానికి MMTS రైల్వే సర్వీసులు

image

HYDలోని లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న MMTS రైల్వే సర్వీసులు సమయానికి అందుబాటులో ఉంటున్నాయని SCR రైల్వే అధికారులు తెలిపారు. 9 6% సమయపాలన పాటిస్తున్నట్లుగా రికార్డులో తెలిసిందని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలిస్తూనే, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు వివరించారు.

News November 27, 2025

ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్‌: ఎండీ

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్‌లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

News November 27, 2025

సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

image

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్‌ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.