News November 27, 2025

బాపట్ల: ఇబ్బందులా.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

image

బాపట్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగితే ఫోన్ నంబర్ 1967 లేదా 77028 06804లను సంప్రదించాలని సూచించారు. ఈ నెంబర్లను కలెక్టర్ బుధవారం విడుదల చేశారు.

Similar News

News November 27, 2025

నెల్లూరు: ఫ్రీగా స్కూటీలు.. 30న లాస్ట్.!

image

దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. 10పాసై, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఇందుకు అర్హులు. జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది అప్లై చేసుకున్నట్లు ఏడీ ఆయుబ్ తెలిపారు. అర్హులు APDASCELC.AP.GOVలో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులు కోరారు.

News November 27, 2025

భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్‌పై రూ.4,000 పెరిగి రూ.1,80,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.9వేలు ఎగబాకింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,27,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,17,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి

News November 27, 2025

సంగారెడ్డి: మూడు గ్రామాల్లోనే సర్పంచ్ ఎన్నికలు

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో మూడు గ్రామాల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మండలంలో భానూర, నందిగామ, క్యాసారం గ్రామాలు మాత్రమే ఉన్నాయి. పటాన్‌చెరు మండలంలో గతంలో 28 గ్రామాలు ఉండగా అమీన్‌పూర్ మండలంగా, ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో ఈ మూడు గ్రామాలే మిగిలాయి. దీంతో జిల్లాలోనే అతి చిన్న మండలంగా పటాన్‌చెరు మిగిలిపోయింది.