News November 27, 2025
HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.
Similar News
News November 28, 2025
సుల్తానాబాద్‌లో డివైడర్ నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై సమీక్ష నిర్వహిస్తూ, పట్టణాల్లో రోడ్లపై తిరిగే పశువులను తొలగించేందుకు మున్సిపల్-పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద రేడియం బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సుల్తానాబాద్‌లో డివైడర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మైనర్లు ఆటోలు నడిపే అంశాన్ని కఠినంగా పర్యవేక్షించాలని, అంతర్గత రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలన్నారు.
News November 28, 2025
జర్నలిస్టులకు అనంతపురం కలెక్టర్ గుడ్ న్యూస్

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పొడిగించిన గడువు 1.12.2025 నుంచి 31.1.2026 వరకు ఉంటుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ గమనించగలరు.
News November 28, 2025
పెద్దపల్లి: FDHS సిబ్బందికి వీడ్కోలు సన్మానం

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో FDHS స్కీమ్‌లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సదానందం, సాజిద్, శ్రీనివాస్, మీర్జా, వాచ్‌మ్యాన్ రాజయ్యలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బదిలీ అయ్యారు. తక్కువ వేతనంతో కీలకంగా సేవలందించిన వీరిని డా.వాణిశ్రీ అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


