News November 27, 2025

బాపట్ల జిల్లా యువతకు గుడ్ న్యూస్

image

మంత్రి సత్య ప్రసాద్ సహకారంతో రేపల్లె ABR ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శుక్రవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి తెలిపారు. ఈ మేళాలో 17 బహుళజాతి కంపెనీలు పాల్గొని సుమారు 800ల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఆపై చదివి, 18-30 సంవత్సరాల వయసున్నవారు అర్హులన్నారు. వివరాలకు 90323 84374, 96406 95229 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News November 28, 2025

ASF: పారామెడికల్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సం. గాను DMLT (30), DECG (30) కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును DEC1 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్ gmckumurambheem asifabad.orgను సంప్రదించాలని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.

News November 28, 2025

నిర్మల్: 2019లో 88 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..!

image

2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో 88 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడు 4 GPలు పెరిగాయి. ప్రస్తుతం 400 గ్రామ పంచాయతీలు ఉండగా.. 3,396 వార్డులున్నాయి. అయితే అప్పటి ప్రభుత్వం పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించినా.. నేటికి ఆ సొమ్ము GP ఖాతాల్లో జమ కాలేదు. అటు ఏకగ్రీవం చేస్తే కేంద్రం నుంచి రూ.10లక్షలు ఇస్తామని బండి ప్రకటించారు.

News November 28, 2025

ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.