News November 27, 2025
భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్‌పై రూ.4,000 పెరిగి రూ.1,80,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే వెండి ధర రూ.9వేలు ఎగబాకింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,27,750కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,17,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి
Similar News
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. నామినేషన్లు ప్రారంభం

TG: గ్రామాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎల్లుండి వరకు కొనసాగనుంది. తొలి విడతలో 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
News November 27, 2025
సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News November 27, 2025
హనుమాన్ చాలీసా భావం – 22

సబ సుఖ లహై తుమ్హారీ శరణా|
తుమ రక్షక కాహూ కో డరనా||
ఆంజనేయుడి శరణు వేడిన వారికి సకల సుఖాలు, అభయాలు లభిస్తాయి. లోకంలో ఆయనే మనకు రక్షకుడిగా ఉన్నప్పుడు, మరే శక్తికి, కష్టానికి భయపడాల్సిన పనిలేదు. హనుమంతుని శక్తి, భక్తి మనకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. అందుకే ఆయణ్ను నమ్మితే కష్టాలు తొలగి, విజయం చేకూరుతుందని నమ్మకం. <<-se>>#HANUMANCHALISA<<>>


