News November 27, 2025
ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న తీరాన్ని తాకిన సెన్యార్ తుఫాను వల్ల ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంతో ఇప్పటికే 28 మంది మరణించారు.
Similar News
News November 28, 2025
ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

వరిలో జింక్ లోపం, కాండం తొలిచే పురుగు నివారణ

☛ వరి పంట మొక్క ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు కనిపిస్తే జింక్ లోపంగా భావించాలి. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
☛ వరిలో కాండం తొలిచే పురుగు/మొగి పురుగు నివారణకు 20-25 కిలోల ఇసుకలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోల చొప్పున కలిపి బురద పదునులో వేయాలి.