News November 27, 2025

SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

image

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.

Similar News

News December 3, 2025

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కలెక్టర్

image

జె.పంగులూరు మండలం చందలూరులో బుధవారం రైతన్నా మీకోసం వారోత్సవాలు నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

News December 3, 2025

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

News December 3, 2025

వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా మల్లికార్జున

image

చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన ఎన్.మల్లికార్జున‌ను వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించినట్లు సంఘం వ్యవస్థాపకుడు పులి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు సంఘానికి, మద్దతు తెలిపిన వాల్మీకులకు మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి–బోయ వర్గాల అభివృద్ధి, ఎస్‌టీ సాధన కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.