News April 17, 2024
రేపటి నుంచి నేనేంటో చూపిస్తా : మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్, కేటీఆర్ త్వరలో జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వల్లే కవిత బలైందన్నారు. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టించి స్వాగతం పలుకుతామని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటే ఏంటో చూపిస్తా అంటూ బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను కొనాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.
Similar News
News November 15, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

NLG : డీసీసీబీలో సహకార వారోత్సవాలు
మిర్యాలగూడ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
NLG : చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి
NLG : వెటర్నరీ ఆసుపత్రిలో మందుల కొరత
NLG : చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు
NLG : 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
NLG : పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
NLG : యాసంగి ప్రణాళిక @ 6,57,229 ఎకరాలు
చిట్యాల : నల్లగొండ పోలీసుల సూపర్
News November 14, 2025
NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
News November 14, 2025
NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


