News November 27, 2025

2 జిల్లాల్లో నియోజకవర్గం.. తొలిదశలోనే పోలింగ్..!

image

రెండు జిల్లాలలో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో ఒకేసారి జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లో 85, జగిత్యాల జిల్లాలో 3 మండలాల్లో 44 పంచాయతీలు ఉండగా, నేటి నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ అనంతరం 11న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లోనూ ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Similar News

News November 27, 2025

WPL షెడ్యూల్ విడుదల

image

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు 4వ ఎడిషన్ కొనసాగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, వడోదరలోని బీసీఏ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇవాళ WPL మెగా ఆక్షన్ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలను లీగ్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ ప్రకటించారు. ప్రస్తుతం ప్లేయర్ల వేలం కొనసాగుతోంది. మ్యాచ్‌ల తేదీలు త్వరలోనే వెల్లడించనున్నారు.

News November 27, 2025

కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

image

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.

News November 27, 2025

రుద్రంగి: ఆర్ఓ కేంద్రాన్ని పరిశీలించిన ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రుద్రంగిలో ఏర్పాటు చేసిన RO కేంద్రాన్ని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా లేరా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని అడిగారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, దరఖాస్తు ఫారాలు తీసుకున్నవారి వివరాలు నమోదు చేయాలన్నారు.