News November 27, 2025
VZM: డిసెంబర్ 5న డ్రమ్స్ శివమణికి సత్కారం

ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో డిసెంబరు 5న విజయనగరంలో ఘంటసాల జయంత్యుత్సవాలు జరుగుతాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణిని ఆరోజు సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.భీష్మారావు తెలిపారు. ముందుగా గుమ్చీ కూడలిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో 12 గంటల స్వరాభిషేకం, సాయంత్రం శివమణి సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు.
Similar News
News November 27, 2025
ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో జరిగిన విభేదాలపై తొలిసారి స్పందించారు. దేవుడు వరం ఇస్తే కుటుంబం మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటానని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో గొడవలు సహజమని, కానీ చివరికి అందరూ ఒక్కటిగా ఉండటం ముఖ్యమన్నారు. గొడవల గురించి తాను బాధపడలేదన్న వార్తలు తప్పు అని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించినప్పటికీ బయటపెట్టలేదని తెలిపారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టపడనని అన్నారు.
News November 27, 2025
ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత: ADB కలెక్టర్

జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాజకీయ పార్టీ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.


