News April 17, 2024
HYDలో ఆదివారం మటన్ షాపులు బంద్

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
SHARE IT
Similar News
News December 31, 2025
BIG BREAKING: GHMC ఖేల్ ఖతం!

HYD ఒక మహా నగరం. పాలనలో వేగం కోసం ఇప్పుడు ‘గ్రేటర్’ విడిపోక తప్పేలా లేదు. FEB 9 వరకు ప్రస్తుత GHMC టీమ్ కొనసాగుతుందని ఆఫీసర్లు తేల్చి చెప్పేశారు. ఆ గడువు ముగియగానే నగరాన్ని కనీసం 3 లేదా 4 మున్సిపల్ కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధమైంది. ఇప్పటికే 106 ప్రాంతాల సరిహద్దులను మార్చేసి, మరో 30 ఏరియాలకు కొత్త పేర్లు కూడా ఫిక్స్ చేసేశారు. మన హైదరాబాద్ మ్యాప్ మారుతోంది.. రెడీగా ఉండండి!
News December 31, 2025
HYD: రాత్రి 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో కఠిన భద్రతా చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని CP సజ్జనార్ స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు తప్పదని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతతో కొత్త ఏడాదిని జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News December 31, 2025
31st నైట్ HYDలో ఈ రూట్లు బంద్

New Year వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, PV మార్గ్, పలు ఫ్లైఓవర్‌లను పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.


