News November 27, 2025
బ్యాంకర్లు రుణ లక్ష్యసాధనలో పురోగతి సాధించాలి: ASF కలెక్టర్

బ్యాంకర్లు 2025-26 వార్షిక సంవత్సర రుణ లక్ష్య సాధనలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్‌లో వార్షిక సంవత్సరం 2వ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్‌డీఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్‌లతో కలిసి బ్యాంక్ లింకేజీ రుణాలపై సమీక్షించారు.
Similar News
News December 1, 2025
ఇవాళ ఏలూరు జిల్లాలో సీఎం పెన్షన్ల పంపిణీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అటు నల్లమాడులో P4 మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఉంగుటూరులో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయడానికి ముఖ్య నేతలతో CM భేటీ కానున్నారు. 3.35PMకు జిల్లా పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి బయల్దేరతారు.
News December 1, 2025
నేడు ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు

నేడు ఏకాదశి. ఈ పవిత్ర దినాన కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. దేవుడి స్మరణలో కాలం గడపాలి. వీలైతే నదీ స్నానం, లేకపోతే నదీజలం కలిసిన నీటితో స్నానం చేయాలి. ఆవునేతితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి. వైష్ణవాలయానికి వెళ్లాలి. మరుసటి రోజు ద్వాదశి తిథిన దీక్ష విరమించాలి. ఫలితంగా విష్ణుమూర్తి,లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.’
News December 1, 2025
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం

సూర్యుడు ఉత్తర నక్షత్రంలోకి సెప్టెంబర్ మొదటి వారంలో, హస్త నక్షత్రంలోకి సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ తొలి వారంలో ప్రవేశిస్తాడు. సాధారణంగా SEPT, OCT నెలల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ వర్షాలు వరి పంటకు, ఇతర ఖరీఫ్ పంటలకు చాలా కీలకం. అందుకే ‘ఉత్తర, హస్త నక్షత్రాలలో వర్షాలు కురవడం ఖాయం, అవి కురిస్తేనే పంటలకు నీరు పుష్కలంగా లభిస్తుంది” అనే అర్థంలో ఈ సామెతను పూర్వీకులు ఉపయోగించేవారు.


