News November 27, 2025
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి: ములుగు SP

మేడారం జాతర ఏర్పాట్లలో అలసత్వం వహించొద్దని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ అన్నారు. ములుగులో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరలో ఎలాంటి అలసత్వం వహించొద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై విస్తృతంగా చర్చించి, ప్రతి అధికారి వారికి అప్పగించిన పనిని నిబద్ధత, బాధ్యతతో నిర్వర్తించాలన్నారు.
Similar News
News November 27, 2025
తిరుపతిలో రూ.3 కోట్లతో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్‌షిప్

తిరుపతిని మరింత అభివృద్ధి చేసేలా 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో ఆధ్యాత్మిక టౌన్‌షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డెల్లా గ్రూప్ ఈ టౌన్‌షిప్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇందులో 5 వేల సంవత్సరాల హిందూ చరిత్రను ప్రతిబింబించే ఎగ్జిబిషన్, వసుధైక కుటుంబం టౌన్‌షిప్ వంటి ఆకర్షణలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

భూపాలపల్లిలో కాంగ్రెస్ మీటింగ్

భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరి చొప్పునే అభ్యర్థిగా పోటీలో ఉండి అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, టీపీసీసీ సభ్యులు గాజర్ల అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.