News November 27, 2025
ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

ఆరబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పౌరసరఫరాల అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ, గోనెసంచులు తదితర అంశాలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 27, 2025
NGKL: మొదటి రోజు నామినేషన్లు మండలాల వారీగా ఇలా..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 121 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.
వంగూరు: 24
తెలకపల్లి: 25
తాడూరు: 23
కల్వకుర్తి: 19
వెల్దండ: 19
ఊర్కొండ: 11
అలాగే, వార్డులకు 26 మంది నామినేషన్లు వేశారు.
News November 27, 2025
సిరిసిల్ల: జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ జనరల్, వ్యయ అబ్జర్వర్లు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ అధికారులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.
News November 27, 2025
సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.


