News November 27, 2025

SKLM: జిల్లాకు చేరుకున్న శాసనసభ అంచనాల కమిటీ అధికారులు

image

ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ అధికారులు గురువారం శ్రీకాకుళం చేరుకున్నారు. ఇన్‌ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి కే.సాయిప్రత్యూష, DSP వివేకానంద, DRDA PD కిరణ్ కుమార్ ఇతర అధికారులు అధికారులు ఘన స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు వివి సూర్యనారాయణరాజు, వరుదు కళ్యాణి అధికారులు ఉన్నారు.

Similar News

News November 27, 2025

SKLM: రేషన్ షాపుల్లో బియ్యానికి బదులు రాగులు పంపిణీ.!

image

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులకు డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించాలన్నారు.

శ్రీకాకుళం: యాక్సిడెంట్..మృతుల వివరాలు ఇవే.!

image

పలాస మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు <<18406276>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలకాపు వేణుగా పోలీసు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23) ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందిన యువకుడు అని తెలిపారు.