News November 27, 2025
విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంచాలి: భూపాలపల్లి కలెక్టర్

విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తిని పెంపొందించడంతోపాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్‌లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ బోధన అలాగే ఫౌండేషన్ అందించే సామగ్రి అన్ని పాఠశాలలకు చేరాలన్నారు.
Similar News
News November 28, 2025
కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

AP: పాడి ఉత్పత్తుల సంస్థ ACE ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఆసియాలోనే తొలిసారి అత్యాధునిక డెయిరీ న్యూట్రీషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఇందుకోసం రూ.305 కోట్లు వెచ్చించనుంది. ఈ ప్లాంట్‌లో చిన్నపిల్లలు, పెద్దల ఆరోగ్యం, పోషణకు దోహదం చేసే ఉత్పత్తులను తయారుచేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయనుంది.
News November 28, 2025
SVUలో ర్యాగింగ్.. హైకోర్టు కీలక తీర్పు

SVU సైకాలజీ డిపార్ట్మెంటులో జూనియర్లపై HOD ఆదేశాలతో సీనియర్లు <<18239778>>ర్యాగింగ్<<>> చేయగా.. అప్పట్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ అధికారులు విద్యార్థి సంఘాలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలని పరిశోధక విద్యార్థి అశోక్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన కోర్టు వర్సిటీ అధికారులకు నోటీసులు పంపమని ఆదేశించినట్లు అశోక్ పేర్కొన్నారు.
News November 28, 2025
సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.


