News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. పోలీసులు READY

image

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కమిషనరేట్‌కు చెందిన అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ల వారీగా గ్రామాల వివరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

Similar News

News December 3, 2025

శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

image

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.

News December 3, 2025

పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: షర్మిల

image

కోనసీమకు TG ప్రజల దిష్టి తగిలిందంటూ Dy.CM పవన్ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. ‘పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు. మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం సరికాదు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లు కూలాయి. చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించండి’ అని ట్వీట్ చేశారు.

News December 3, 2025

చౌడు నేలల్లో యూరియాను ఎలా వేస్తే మంచిది?

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.