News April 17, 2024
TVల్లోకి వచ్చేస్తోన్న ‘హనుమాన్’

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Similar News
News January 13, 2026
‘భూభారతి’లో బకాసురులు!

TG: భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన <<18815490>>అక్రమాల<<>> తీగ లాగితే డొంక కదులుతోంది. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా మీసేవ, ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు స్టాంప్ డ్యూటీ, ఛార్జీలను నొక్కేసినట్లు గుర్తించారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన సూత్రధారి బస్వరాజుతో పాటు పాండు, గణేశ్ సహా 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. రూ.50Cr స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.
News January 13, 2026
బాధితులకు రూ.25వేల సాయం ప్రకటన

AP: కాకినాడ(D) సార్లంకపల్లె <<18842252>>అగ్నిప్రమాదం<<>>పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ.25వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం వసతి, ఇతర సహాయాలు అందించాలని సూచించారు. కాగా నిన్న సార్లంకపల్లెలో 40 తాటాకు ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన విషయం తెలిసిందే.
News January 13, 2026
‘MSVPG’కి ఫస్ట్ డే రూ.84 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నిన్న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్స్+ఫస్ట్ డేకి కలిపి రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సెంటర్లలో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయని పేర్కొంది. చిరంజీవి లుక్స్, మేనరిజం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అభిమానులను మెప్పిస్తున్నాయి.


