News November 28, 2025

DEC 14 నుంచి ఉచిత సివిల్స్ కోచింగ్: మంత్రి సవిత

image

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DEC 14 నుంచి నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. విజయవాడ గొల్లపూడిలోని కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి, ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 100మందికి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పిస్తామని, దరఖాస్తులను DEC 3వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. DEC 7న అర్హత పరీక్ష నిర్వహించి, 11న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.

Similar News

News November 28, 2025

వర్ని: సర్పంచ్ ఎలక్షన్స్.. రెండు చోట్ల ఏకగ్రీవ తీర్మానం

image

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ తండా, చెలక తండా గ్రామపంచాయతీల సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరే నామినేషన్ వేయాలని స్థానికులు తీర్మానం చేశారు. గ్రామాల అభివృద్ధికి, ఐక్యతకు నిదర్శనంగా ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకోవాలని తీర్మానించారు. సిద్దాపూర్ సర్పంచ్‌ అభ్యర్థిగా బాల్‌సింగ్, చెలక తండా సర్పంచ్‌ అభ్యర్థిగా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

News November 28, 2025

NTR: న్యాయం కోసం వస్తే.. అసభ్య ప్రవర్తన

image

విజయవాడకు చెందిన న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గిరిజన మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఓ న్యాయవాది వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుండగా ఆయన సదరు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన మహిళ మాచవరం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా ఎస్సై శంకరరావు కేసు నమోదు చేశారు.

News November 28, 2025

HYD: తెలుగు వర్సిటీ..”SPTU-B” ఘన విజయం

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో సౌత్ జోన్ ఎంపికలలో భాగంగా నిర్వహించిన T20 మ్యాచ్‌లో ‘SPTU-A’ జట్టుపై ‘SPTU-B’ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SPTU-B జట్టు 20 ఓవర్లలో 195/7 పరుగులు చేయగా.. వాసు 52 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. SPTU-A 17.2 ఓవర్లకే 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గెలుపొందిన జట్టుకు వీసీ, రిజిస్ట్రార్‌ అభినందనలు తెలిపారు.