News November 28, 2025

నంద్యాల: ‘సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు చర్యలు’

image

జిల్లాలో స్పష్టమైన, సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సమగ్ర చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు వివరించారు. విజయవాడలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ రాము నాయక్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

ఎన్నికల ప్రచార ఖర్చు పకడ్బందీగా నమోదు చేయాలి: పరిశీలకులు

image

ఎన్నికల ప్రచార ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు వివరాలను మూడు సార్లు ఎన్నికల పరిశీలకుల ముందు తప్పనిసరిగా హాజరై చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రచార సర్వేను పరిశీలకులు పూర్తిగా పర్యవేక్షించాలని సూచించారు.

News December 3, 2025

TG హైకోర్టు న్యూస్

image

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

News December 3, 2025

అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

image

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.