News April 17, 2024

రెండు స్థానాల్లో నవీన్ పట్నాయక్ పోటీ

image

బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 2019లోనూ ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఈ రాష్ట్రంలో 147 నియోజకవర్గాలకు గాను నాలుగు దశల్లో(మే 13, 20, 25, జూన్1 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News January 6, 2026

కంది పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కంది పంటలో 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతే కోయాలి. పంట కోతకు 3-4 రోజుల ముందు లీటర్ నీటికి ఇమామెక్టిన్ బెంజోయెట్ 0.4 గ్రా. కలిపి పిచికారీ చేస్తే పంట నిల్వ సమయంలో పెంకు పురుగు ఆశించకుండా కాపాడవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి మొదలగునవి లేకుండా చేసి 3-4 రోజుల వరకు ఎండబెట్టాలి. గింజలలో 9-10 శాతం తేమ ఉండేటట్లుగా చూసుకోని నిల్వ చేయాలి.

News January 6, 2026

త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

image

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో షెడ్యూల్ వెలువడొచ్చని CM, PCC చీఫ్ పార్టీ ముఖ్య నేతలను అలర్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ లోపే పెండింగ్ పనులు పూర్తిచేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో పెండింగ్ పనులను గుర్తించి పూర్తిచేసేలా నిధులు విడుదల చేయించాలని CM మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.

News January 6, 2026

కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు: మంజ్రేకర్

image

విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో ఆడటాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. ‘టెస్టుల్లో జో రూట్ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాడు. కానీ విరాట్ టెస్టులను వదిలేశాడు. రిటైర్మెంట్‌కు ముందు అతడు ఇబ్బందిపడటం నిజమే. కానీ ఎందుకు విఫలమవుతున్నాడనేది మనసు పెట్టి ఆలోచించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్‌కు ఈజీ ఫార్మాట్ అయిన వన్డేలను కోహ్లీ ఎంచుకోవడం నిరాశకు గురిచేసింది’ అని పేర్కొన్నారు.