News April 17, 2024

18 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో బుధవారం సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మీడియా సెంటర్‌ను కలెక్టర్ డాక్టర్ సృజన ప్రారంభించారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల సంసిద్ధతపై మీడియాతో మాట్లాడారు. 18వ తేదీ 11 గంటల నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నామినేషన్‌కు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News February 27, 2026

358 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. మొత్తం 5,069 మంది విద్యార్థులకు గానూ 4,711 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

‘కర్నూలు జిల్లాలో పుష్కలంగా ఎరువుల నిల్వలు’

image

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. జిల్లా అవసరాల కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 27, 2026

బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.