News April 17, 2024
వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్

AP: వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు. మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు. వైసీపీ పాలనలోనే బాబు, లోకేశ్‌పై కేసులు ఎక్కువగా పెట్టారు. ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం’ అని ఆయన హెచ్చరించారు.
Similar News
News January 12, 2026
ఈ OTTలోనే ‘మన శంకరవరప్రసాద్ గారు’ స్ట్రీమింగ్!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిన్న ప్రీమియర్స్‌తో రిలీజైన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ‘ZEE5’ దక్కించుకోగా శాటిలైట్ హక్కులను ‘జీ తెలుగు’ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే ఇది OTTలో స్ట్రీమింగ్ కానుంది. అనంతరం బుల్లితెరపై సందడి చేయనుంది. మీరూ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.
News January 12, 2026
పెట్టుబడుల డెస్టినేషన్‌గా ఏపీ: చంద్రబాబు

AP: దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25శాతం రాష్ట్రానికే వచ్చాయని మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ల డెస్టినేషన్‌గా మారిందన్నారు. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలన్నీ సాకారం అయితే 16లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
News January 12, 2026
APPLY NOW: CSIR-CECRIలో ఉద్యోగాలు

<


