News November 28, 2025
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అపరాధ రుసుముతో చివరి అవకాశం

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు అపరాధ రుసుముతో చివరి అవకాశం ఇచ్చారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చని డైరెక్టర్ పీవీ శ్రీహరి అన్నారు. ఆసక్తిగల వారు అధికారిక వెబ్‌సైట్ లేదా మీ సేవా/టీజీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసి, పత్రాలను సంబంధిత అధ్యయన కేంద్రాలకు సమర్పించాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ విద్యార్థులు కూడా ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.
Similar News
News November 28, 2025
HYD: నేడు, రేపు డిగ్రీ కోర్సుల తుది కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తుది దశ కౌన్సిలింగ్ ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సుల భర్తీకి సంబంధించింది. ప్రస్తుతం రైతు కోటాలో 22 సీట్లు, రైతు కూలీల కోటాలో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News November 28, 2025
NTR: వరప్రదాయిని వాగు.. కోరింది బాగు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో లక్ష ఎకరాల సాగునీటి అవసరాలు తీరుస్తున్న మున్నేరు, తమ్మిలేరు వంటి 13కు పైగా వాగులు ఆక్రమణకు గురవుతున్నాయి. వరద ప్రవాహంలో ప్రధానంగా ఉన్న ఈ వరప్రదాయినులు ప్రస్తుతం ఇసుక మేటలు, ముళ్లపొదలు, కబ్జాలతో పూడుకుపోయాయి. వీటి అభివృద్ధిపై ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
News November 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


