News November 28, 2025

హుస్నాబాద్: 1995లో సర్పంచ్.. 2 పర్యాయాలు ఎమ్మెల్యే

image

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు మొదట సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1995లో ఆయన సింగాపూర్ సర్పంచ్‌గా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. అనంతరం ఫాక్స్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఛైర్మన్‌గా పనిచేసిన సతీష్ బాబు.. 2014, 2018లో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేశారు.

Similar News

News November 28, 2025

ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తాం: ఎస్పీ నరసింహ

image

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసత్య, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, డబ్బు రవాణాపై నిఘా పెంచామని, అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 28, 2025

సుల్తానాబాద్‌లో డివైడర్ నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్

image

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై సమీక్ష నిర్వహిస్తూ, పట్టణాల్లో రోడ్లపై తిరిగే పశువులను తొలగించేందుకు మున్సిపల్-పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద రేడియం బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సుల్తానాబాద్‌లో డివైడర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మైనర్లు ఆటోలు నడిపే అంశాన్ని కఠినంగా పర్యవేక్షించాలని, అంతర్గత రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలన్నారు.

News November 28, 2025

జర్నలిస్టులకు అనంతపురం కలెక్టర్ గుడ్ న్యూస్

image

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పొడిగించిన గడువు 1.12.2025 నుంచి 31.1.2026 వరకు ఉంటుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ గమనించగలరు.