News November 28, 2025

సూర్యాపేట జిల్లా గ్రామ ఓటర్ల లెక్క

image

సూర్యాపేట జిల్లాలో గ్రామ ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా గ్రామ ఓటర్లు ఉన్నట్లు 6,94,815 ఎన్నికల సంఘం ప్రకటించింది. గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 46,796 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 22 మంది ఉన్నారు. మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Similar News

News December 1, 2025

అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.

News December 1, 2025

సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

image

హీరోయిన్ సమంత రెండో వివాహంపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీనమైన, నిరాశయులైన పురుషులను డబ్బుతో కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పీఆర్‌ గొప్పవారిగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సమంత వివాహంపై చేసిన ఈ వ్యాఖ్యలు SMను ఊపేస్తున్నాయి.

News December 1, 2025

జగిత్యాల: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్

image

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత వృక్షశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. వృక్షశాస్త్రంలో టిష్యూ కల్చర్ ఫోటో కెమికల్ అనాలసిస్ అండ్ ఫార్మా కాలజికల్ స్టడీస్ ఇన్ రూబియా కార్డిఫోలియా అనే ముకపైనా రీసెర్చ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుజాతను ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.