News November 28, 2025
HYD: నూతన అధ్యాయానికి జలమండలి గ్రీన్ సిగ్నల్..!

HYDలో నీటి సరఫరా వ్యవస్థలో నష్టాలను తగ్గిస్తూ, నీటి నాణ్యతను మెరుగుపరచేందుకు నూతన టెక్నాలజీకి HMWSSB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరి వినియోగదారుని వరకు రియల్‌టైమ్ పర్యవేక్షణ కోసం రా వాటర్ పంపింగ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, రిజర్వాయర్లను పరిశీలించే వ్యవస్థను ప్రస్తుత స్కాడాతో అనుసంధానం చేసే సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు.
Similar News
News December 5, 2025
వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్‌లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.
News December 5, 2025
అద్దెకు పురుషులు.. ఎక్కడో తెలుసా?

లాత్వియా దేశంలో పురుషుల కొరత కారణంగా మహిళలు “అద్దె” సేవలను వినియోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింట్లు వేయడంతో పాటు ఇతర పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది పార్ట్‌నర్ కోసం ఇతర దేశాలకు సైతం వెళ్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి సేవలు ఉన్నాయి.
News December 5, 2025
ఒంటరితనంతో మహిళల్లో తగ్గుతున్న ఆయుష్షు

ప్రస్తుతకాలంలో చాలామందిలో ఒంటరితనం పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా లోన్లీనెస్‌తో బాధపడుతున్న వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది స్త్రీలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మహిళల DNA రక్షణ కవచంలోని కణాలు కుంచించుకుపోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తున్నట్లు తెలిపారు. మహిళల్లో స్ట్రెస్ హార్మోన్లు పెరగడం, ఇమ్యునిటీ తగ్గడం దీనికి కారణమని చెబుతున్నారు.


