News November 28, 2025
మహబూబ్‌నగర్: ఎన్నికల వేళ.. మందుబాబుల కొత్తపాట!

ఊరు ఎన్నికలు రావడంతో ఉమ్మడి MBNRలో మందు బాబులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్ లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా, ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ మందు తాగొద్దన్నారు’ అంటూ పరోక్షంగా పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు.. ఇప్పడు, టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.
Similar News
News November 28, 2025
ట్రాఫిక్ చలాన్లపై నివేదిక ఇవ్వాలని హోంశాఖకు హైకోర్టు నోటీసులు

ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని నగరవాసి రాఘవేంద్ర చారి పిటిషన్ దాఖలు చేశారు. తనకి 3 చలాన్లు వేశారని, ట్రాఫిక్ పోలీసులు సొంత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
News November 28, 2025
సిద్దిపేట: గర్భిణీ స్త్రీలకు HIV, టీబీ పరీక్షలు నిర్వహించాలి: DMHO

గర్భిణీ స్త్రీలకు HIV, టీబీ పరీక్షలు నిర్వహించాలని DMHO ధనరాజ్ సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని టీ.హబ్, ఐసీటీసీ ART సెంటర్, టీబి క్లినిక్‌ను ఆకస్మిక సందర్శించారు. క్లినిక్‌లో నిర్వహిస్తున్న టీబి టెస్టుల గురించి మందుల సరఫరా, మందుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి అనంతరం సిబ్బందితో మాట్లాడారు.
News November 28, 2025
MHBD: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎంపీడీఓలు, ఎంఆర్‌ఓలను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.


