News November 28, 2025

నాగార్జున సాగర్: శిల్పాలతో బుద్ధుని జీవితం బోధపడేలా..!

image

నాగార్జునసాగర్‌లో నిర్మిస్తోన్న బుద్ధచరిత వనం ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ఇక్కడి శిల్పాలు బుద్ధుడి సంపూర్ణ జీవన ప్రయాణాన్ని జీవంగాను చూపిస్తున్నాయి. జననం, గౌతముని రాజకుమార జీవితం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం వంటి ముఖ్య ఘట్టాలు ప్రతీ శిల్పంలో ప్రతిబింబిస్తున్నాయి. సందర్శకులకు ప్రతి శిల్ప సమూహం ఆధ్యాత్మికత, శాంతి, బోధనలను స్పష్టంగా తెలియజేసేలా రూపొందించారు.

Similar News

News November 28, 2025

ఈ విచిత్రాన్ని గమనించారా?

image

ప్రపంచంలో చాలా చోట్ల భవనాలు, హోటళ్లు, హాస్పిటల్ బిల్డింగ్స్‌లో 13వ అంతస్తు ఉండదనే విషయం మీకు తెలుసా? ‘ట్రిస్కైడెకాఫోబియా’ వల్ల చాలామంది 13వ అంకెను అశుభంగా భావిస్తారు. ఈ అపోహ వల్ల ఎవరూ 13వ అంతస్తులో ఉండేవారు కాదట. వ్యాపార నష్టం జరగొద్దని నిర్మాణదారులు 13కు బదులుగా 12Aను వేస్తారని వినికిడి. చాలాచోట్ల ICU బెడ్స్‌కి కూడా 13 లేకుండా 14 రాస్తారని వైద్యులు చెబుతున్నారు. మీరు ఇది గమనించారా?

News November 28, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 112 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News November 28, 2025

తంగళ్ళపల్లి: తల్లి మరణం భరించలేక తనయుడి ఆత్మహత్య

image

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన తంగళ్ళపల్లికి చెందిన లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలుసుకున్న కొడుకు అభిలాష్ అదే మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అభిలాష్ సిరిసిల్లలోని సర్దాపూర్ బెటాలియల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి, కుమారుడు మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.