News November 28, 2025
సిద్దిపేట: బీసీ సంక్షేమంపై మంత్రి పొన్నం సమీక్ష

మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా, రాబోయే గ్లోబల్ సమ్మిట్‌లో బీసీ సంక్షేమ శాఖ ప్రాధాన్యాంశాలను చర్చించారు. శాఖ పనితీరు, భవిష్యత్ కార్యక్రమాలు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులు వివరించారు.
Similar News
News November 28, 2025
ఈ విచిత్రాన్ని గమనించారా?

ప్రపంచంలో చాలా చోట్ల భవనాలు, హోటళ్లు, హాస్పిటల్ బిల్డింగ్స్‌లో 13వ అంతస్తు ఉండదనే విషయం మీకు తెలుసా? ‘ట్రిస్కైడెకాఫోబియా’ వల్ల చాలామంది 13వ అంకెను అశుభంగా భావిస్తారు. ఈ అపోహ వల్ల ఎవరూ 13వ అంతస్తులో ఉండేవారు కాదట. వ్యాపార నష్టం జరగొద్దని నిర్మాణదారులు 13కు బదులుగా 12Aను వేస్తారని వినికిడి. చాలాచోట్ల ICU బెడ్స్‌కి కూడా 13 లేకుండా 14 రాస్తారని వైద్యులు చెబుతున్నారు. మీరు ఇది గమనించారా?
News November 28, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 112 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 112 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News November 28, 2025
తంగళ్ళపల్లి: తల్లి మరణం భరించలేక తనయుడి ఆత్మహత్య

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన తంగళ్ళపల్లికి చెందిన లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలుసుకున్న కొడుకు అభిలాష్ అదే మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అభిలాష్ సిరిసిల్లలోని సర్దాపూర్ బెటాలియల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి, కుమారుడు మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.


