News November 28, 2025

డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై USలో అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

Similar News

News November 28, 2025

భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 28, 2025

స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

image

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్‌’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.

News November 28, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు వీరే

image

TG: హైదరాబాద్‌లో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు దేశవిదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ఆనంద్ మహీంద్రా, UAE రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ అంతర్జాతీయ, టెక్ కంపెనీల CEOలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లూ రానున్నారు.