News November 28, 2025
సిరిసిల్ల: ఉపాధ్యాయురాలిగా మారిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్లలో జరిగిన ఇన్స్పైర్, విద్యా వైజ్ఞానిక సదస్సులో ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులతో మమేకమయ్యారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, థర్మో డైనమిక్స్, కిరణజన్య సంయోగ క్రియ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన వచ్చేందుకు ఎగ్జిబిషన్లు దోహదపడతాయన్నారు.
Similar News
News December 6, 2025
విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లైట్‌ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
News December 5, 2025
సిద్దిపేట: ప్రభుత్వాన్ని బీసీ సమాజం క్షమించదు: హరీష్ రావు

బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర చారి బలైపోవడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. రేవంత్ అధికార దాహానికి బలైన ప్రాణం ఇది అని ‘X’లో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.
News December 5, 2025
సిద్దిపేట: కలెక్టర్‌ను కలిసిన స్వయం సహాయక సభ్యులు

స్వయం సహాయక సంఘా సభ్యులు Event Management పై National Institute of Tourism and Hospitality Management(NITHM) హైదరాబాద్‌లో 5 రోజులు పాటు శిక్షణ తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఆరుగురు స్వయం సహాయక సభ్యులు బాలలక్ష్మి, మంజుల, శ్వేతాకళ, భూలక్ష్మి, శిరీష, లావణ్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి పలు రకాల యూనిట్లకు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు.


