News April 17, 2024

TMC మేనిఫెస్టో.. ఫ్రీగా ఏడాదికి 10 సిలిండర్లు

image

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC) ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(NRC), ఉమ్మడి పౌరస్మృతి(UCC)ని బెంగాల్‌లో అమలు చేయబోమని అందులో పేర్కొంది. అలాగే పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు, ఇళ్లు, ఫ్రీ రేషన్ డెలివరీ తదితర 10 హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చింది.

Similar News

News November 18, 2024

BREAKING: పోసానిపై సీఐడీ కేసు

image

AP: తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆయనపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

News November 18, 2024

కిరణ్.. ‘క’ మూవీ చూసి కాల్ చేస్తా: అల్లు అర్జున్

image

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్‌ను అభినందించారు. ప్రస్తుతం బిజీగా ఉండటం వల్ల సినిమాను చూడలేకపోతున్నా అని, కానీ తప్పకుండా మూవీ చూసి హీరో కిరణ్‌కు ఫోన్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘పుష్ప-2’ ట్రైలర్ బాగుందని కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ ఇలా స్పందించారు.

News November 18, 2024

రేవంత్ పాలనలో 15 ఏళ్లు వెనక్కి: హరీశ్ రావు

image

TG: రేవంత్ పాలనలో తెలంగాణ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలు బంద్ చేసి మూసీ దుకాణం తెరిచారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను నం.1గా మార్చారని చెప్పారు. పేదోళ్లతో పెట్టుకుని రేవంత్ హిట్ వికెట్ చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వస్తారని, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.