News November 28, 2025

వంగూరు: సీఎం సొంత గ్రామ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం..?

image

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి (సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం) సర్పంచ్ స్థానం ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో ఎవరూ నామినేషన్లు వేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో సర్పంచ్‌ స్థానం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News December 1, 2025

సిద్దిపేట: సర్పంచ్ స్థానాలకు 747 నామినేషన్లు వ్యాలిడ్

image

సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో ఏడు మండలాల్లోని 163 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. మొత్తం 953 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 747 నామినేషన్లు వ్యాలిడ్‌గా తేల్చారు. వార్డు స్థానాలకు 3504 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 3429 నామినేషన్లు వ్యాలీడ్‌గా అధికారులు ప్రకటించారు.

News December 1, 2025

సిద్ధిపేట: విధుల్లో నిర్లక్ష్యం.. నలుగురికి షోకాజ్ నోటీసులు

image

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ హైమావతి నోటీసులు ఇచ్చారు. బెజ్జంకి మండల రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి పరమేశ్వర్‌కు నోటీసులు జారీ చేశారు. వీరికి సరైన రిపోర్ట్ ఇవ్వని మండల పంచాయతీ అధికారులు ఖాజా మొయినొద్దీన్, కలింలకు కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు.

News December 1, 2025

WGL: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 294 మద్యం షాపులకు టెండర్లను పిలవగా, 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.314.79 కోట్ల ఆదాయం జమ అయ్యింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర కలిసి వచ్చేలా చేసింది.