News November 28, 2025

సుల్తానాబాద్‌లో డివైడర్ నిర్మాణం చేపట్టాలి: కలెక్టర్

image

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై సమీక్ష నిర్వహిస్తూ, పట్టణాల్లో రోడ్లపై తిరిగే పశువులను తొలగించేందుకు మున్సిపల్-పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్‌ల వద్ద రేడియం బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సుల్తానాబాద్‌లో డివైడర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. మైనర్లు ఆటోలు నడిపే అంశాన్ని కఠినంగా పర్యవేక్షించాలని, అంతర్గత రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలన్నారు.

Similar News

News November 28, 2025

వరంగల్: కాళోజీ ఉపకులపతిపై వేటు..?

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డిపై వేటు వేసినట్టు తెలిసింది. కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై వరుస కథనాలు Way2Newsలో రావడంతో ఇంటెలిజెన్సు రిపోర్టును సీఎం కోరారు. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమికంగా వీసీని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎంవోకు సమగ్ర నివేదిక అందడంతో వేటు పడినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

image

పంచాయితీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో నామినేషన్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News November 28, 2025

పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

image

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.