News November 28, 2025

మోడల్ ఫామ్ డెమో హౌస్‌ను సందర్శించిన కలెక్టర్

image

బూర్గంపాడు మండలంలోని ఎంపీ బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ ఫామ్ డెమో హౌస్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ ఆధారిత బహుముఖ ఆదాయ వనరులను గ్రామస్థులకు చేరువ చేయడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి, సేంద్రియ వ్యవసాయంపై రూపొందించిన ఈ మోడల్ ఫామ్ జిల్లా స్థాయిలో ఆదర్శ ప్రదర్శనగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు.

Similar News

News November 29, 2025

సిద్దిపేట: నేడు పోలీస్ కమిషనర్‌తో ఫోన్ ఇన్

image

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో “పోలీస్ కమీషనర్‌తో ఫోన్-ఇన్” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిద్దిపేట CP విజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ పరిసరాలల, నేర కార్యకలాపాలు, ప్రజా సమస్యలు వంటి ముఖ్యమైన అంశాల గురించి నేరుగా కమిషనర్‌తో మాట్లాడవచ్చన్నారు. శనివారం ఉదయం 11.00 నుంచి 12.00 వరకు 8712667407, 8712667306,
8712667371 ఈ నంబర్‌లకు సంప్రదించాలన్నారు.

News November 29, 2025

నేడు బ్రేక్‌‌ఫాస్ట్ మీట్.. వివాదానికి తెర పడనుందా?

image

కర్ణాటకలో ‘సీఎం కుర్చీ’ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్‌లకు ఇవాళ 9.30AMకు బ్రేక్‌ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ భేటీతో ‘సీఎం’ వివాదానికి తెరదించాలని భావిస్తోంది. కాగా 2023 ఎన్నికల సమయంలో అధిష్ఠానం ఇచ్చిన సీఎం హామీని నెరవేర్చాలని DK అనుచర వర్గం కోరుతోంది. అటు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సిద్దరామయ్య చెప్పారు.

News November 29, 2025

MHBD: చలికాలంలో పల్లెల్లో ఎన్నికల వేడి..!

image

చలికాలం పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. MHBD జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో పల్లె పోరుకు రె‘ఢీ’ అవుతున్నారు. పల్లెల్లో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేస్తున్నాయి.