News November 28, 2025

సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.

Similar News

News December 3, 2025

TG హైకోర్టు న్యూస్

image

* బీసీ రిజర్వేషన్లపై స్టేను హైకోర్టు పొడిగించింది. జనవరి 29 వరకు జీవో 9ని నిలిపివేస్తూ ఉత్తర్వులు.. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా
* లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో లిఫ్ట్, ఎలివేటర్ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు.. చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే అమల్లోకి తేవడానికి ఇంకా ఎన్నేళ్లు కావాలని ప్రశ్న. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

News December 3, 2025

సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

image

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.

News December 3, 2025

DCM అంటే దిష్టి చుక్క మంత్రి.. పవన్‌పై YCP సెటైర్లు

image

AP: కోనసీమ దిష్టి వివాదం నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్‌లోనే ఉండే ఆయన తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే ఆయన ఇటీవల కోనసీమలో వెకేషన్ కోసం పర్యటించారని సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం(DCM) అంటే దిష్టి చుక్క మంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.