News November 28, 2025
GWL: అనైతిక చర్యలకు ఆరేళ్లు నిషేధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదని సూచించారు.
Similar News
News December 3, 2025
మల్యాల: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో నిలిచి

ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవకై ముందుకొచ్చారు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మల్యాల మేజర్ GP సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వీరబత్తిని మాలతీ ప్రతాప్ మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కాగా, మాలతి గతంలో దుబాయ్‌లోని ప్రముఖ సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌లో 18ఏళ్లు ఉద్యోగం చేశారు. ప్రస్తుతం HYDలోని విప్రో సంస్థలో నాలుగేళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
News December 3, 2025
ధర్మశాస్తా దర్శనం: ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే?

అయ్యప్ప స్వాములు ఇరుముడితో 18 మెట్లు దాటిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజు వద్ద ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత చిన్ముద్ర ధారియైన అయ్యప్ప దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని, ఇరుముడిని స్వామికి చూపిస్తారు. నెయ్యభిషేకం చేయిస్తారు. చివరగా మాలికపురత్తమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. <<-se>>#AyyappaMala<<>>
News December 3, 2025
VJA: నేడు సిట్ ముందుకు వైసీపీ నేతల కుమారులు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు నేడు విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. జోగి రాజీవ్, రోహిత్ కుమార్, రాకేశ్, రామ్మోహన్‌కు నోటీసులు అందించారు. ఈ మేరకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు విచారణకు హాజరు కానున్నారు. లాప్‌టాప్‌లోని సమాచారం కోసం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.


