News November 28, 2025

సిద్దిపేట: గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం ఆగ్రహం

image

కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై కథనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, ఇన్‌చార్జీల నియామకాలలో జరిగిన అవకతవకలపై ఆయన వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News November 28, 2025

మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

image

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 28, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు

image

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్‌తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.