News November 28, 2025
MHBD: భూమి పేరు మార్పిడికి లంచం డిమాండ్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ <<18414245>>లంచం<<>> తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. పోచంపల్లి పడమటి తండాకు చెందిన రైతు భూక్య బాలు తండ్రి పేరిట ఉన్న 3.09 గుంటల వ్యవసాయ భూమిని తన పేరు మీదకు మార్చడానికి తహశీల్దార్ రూ.25 వేలు డిమాండ్ చేయగా, రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Similar News
News November 28, 2025
కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం ఆగ్రహం

కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై కథనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, ఇన్‌చార్జీల నియామకాలలో జరిగిన అవకతవకలపై ఆయన వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News November 28, 2025
మంచాన్ని గోడలకు ఆనించవచ్చా?

మంచాన్ని గోడకు ఓవైపు మాత్రమే ఆనించి ఉంచాలని, అదే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. మిగిలిన 3 వైపులా వీలైనంత ఖాళీ స్థలం ఉండాలంటున్నారు. ‘మంచంపై నుంచి వ్యక్తులు సులభంగా దిగడానికి, ఎక్కడానికి అనుకూలంగా ఉండాలి. గదిలో ఇరుకు ఉండకుండా, ఏ ఇబ్బంది లేకుండా నడిచేలా స్పేస్ ఉండాలి. దీనివల్ల శక్తి ప్రవాహం పెరుగుతుంది. 3 వైపులా గోడలు ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 28, 2025
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు

ఉజ్వల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేర్, యుఏఈ రాజ కుటుంబ సభ్యుడు షేక్ తారిక్ అల్ ఖాసిమీ, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్‌తో పాటు ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు హాజరుకానున్నారు.


