News November 28, 2025

గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇల్లంతకుంట వాసి మృతి

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

image

హీరోయిన్ సమంత రెండో వివాహంపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీనమైన, నిరాశయులైన పురుషులను డబ్బుతో కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పీఆర్‌ గొప్పవారిగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సమంత వివాహంపై చేసిన ఈ వ్యాఖ్యలు SMను ఊపేస్తున్నాయి.

News December 1, 2025

జగిత్యాల: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్

image

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత వృక్షశాస్త్రంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. వృక్షశాస్త్రంలో టిష్యూ కల్చర్ ఫోటో కెమికల్ అనాలసిస్ అండ్ ఫార్మా కాలజికల్ స్టడీస్ ఇన్ రూబియా కార్డిఫోలియా అనే ముకపైనా రీసెర్చ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుజాతను ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు.

News December 1, 2025

కరీంనగర్: ప్రచారంలో అభ్యర్థుల పాట్లు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయుచున్న అభ్యర్థులు వారి గెలుపు కోసం పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ చాయ్ తాగినావా? తిన్నవా? మంచిదేనా? ఎటు పోతున్నావ్ అంటూ తదితర ముచ్చట్లు పెడుతూ చివరకు తాను గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌కు లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నానని, జర నాకు ఓటు వేసి గెలిపించండని ప్రాధేయపడుతున్నారు.