News November 28, 2025

వికారాబాద్ జిల్లాలో రెండో రోజు 178 నామినేషన్లు

image

వికారాబాద్ జిల్లాలోని తాండూర్ డివిజన్‌లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11వ తేదిన జరగనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు శుక్రవారం 178 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు.

Similar News

News November 29, 2025

TU: మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

image

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు. మొత్తంగా 391 మంది గైర్హాజరై ఇద్దరు డిబార్ అయినట్లు వెల్లడించారు.

HYD: కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య (UPDATE)

image

బోడుప్పల్‌లో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. అంజయ్య‌(55)కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నెల క్రితం కూతురి వివాహమైంది. పుట్టింట్లో ఉంది. గురువారం రాత్రి భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్‌తో కలిసి అంజయ్య మద్యం తాగారు. అర్ధరాత్రి ముగ్గురు అతడి మెడకు చున్నీ బిగించి హతమార్చారు. కూతురు అడ్డుకోగా గదిలో బంధించారు. పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది.