News November 29, 2025
పార్వతీపురం: గిరిజన పీజీఆర్‌ఎస్‌కి 26 వినతులు

గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడిఏ గిరిమిత్ర హాలులో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో సమక్షంలో జరిగింది. గిరిజనుల వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చూడాలన్నారు.
Similar News
News December 3, 2025
‘పంచాయతీ’ పోరుకు యువత జై!

TG: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినవారిలో యువతే అధికంగా ఉన్నారు. పెద్దలకే పరిమితం అనుకున్న పాలిటిక్స్‌లో తమ మార్క్ చూపించేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతోంది. రెండు విడతల్లో 70శాతానికి పైగా నామినేషన్లలో 30-44 ఏళ్ల వారే ఉండటం దీనికి నిదర్శనం. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలు చోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు.
News December 3, 2025
నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. 10.55AMకు తూ.గో. జిల్లా నల్లజర్లలో జరగనున్న ‘రైతన్నా.. మీ కోసం’ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.45PM నుంచి 3.15PM వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 6PMకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
News December 3, 2025
తూ.గో: నిరుద్యోగులకు GOOD NEWS

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి టెన్త్, ఆపై చదువుకున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, అనంతరం ఉద్యోగం కల్పిస్తారని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


