News April 17, 2024

‘ఫ్యామిలీ స్టార్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

image

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ప్రసారం కానుందని టాక్. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఉగాది కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేదు.

Similar News

News November 3, 2025

మట్టి నింపిన బావులపై ఇల్లు కట్టుకోవచ్చా?

image

లోతట్టు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం సురక్షితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. మట్టి నింపిన బావులు, గుంటలపై ఉండే ఇల్లు ప్రమాదానికి సంకేతమన్నారు. ‘ఈ స్థలాల్లో పునాదులు నిలవలేవు. భూమి జారే అవకాశముంది. నీరు నిలిచి ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది నివాసితుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇంటికి స్థిరత్వం, నివాసితులకు ఆరోగ్యం సిద్ధించాలంటే ఇలాంటి భూములను విడిచిపెట్టాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>

News November 3, 2025

రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

News November 3, 2025

Photo: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్

image

భారత మహిళా జట్టు తొలిసారి <<18182320>>ప్రపంచకప్<<>> గెలిచి దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ఐకానిక్ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫొటోలకు పోజులిచ్చారు. 2011 నాటి ధోనీ పోజ్‌ను రీక్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ICC ట్వీట్ చేసింది. అంతకుముందు ‘క్రికెట్ అందరి గేమ్’ అని రాసిన టీషర్ట్‌ ధరించి, కప్‌తో నిద్రిస్తున్న ఫొటోను హర్మన్ షేర్ చేశారు.