News April 17, 2024

అక్రమ రవాణ కట్టడికి పటిష్ఠ చర్యలు: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా మనుబోలు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 120 ఫ్యాన్లు, 24 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏఎస్ పేట పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3500 నగదు, 255 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News January 10, 2026

ఆధునిక సాగుతోనే రైతులకు మేలు: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు మెరుగైన లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని ఆయన పరిశీలించారు. పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పద్ధతులను గ్రామంలోని ఇతర రైతులకు కూడా వివరించాలని అధికారులను ఆదేశించారు.

News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

image

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్‌లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్‌ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.

News January 10, 2026

కాకాణి, సోమిరెడ్డి మధ్య ఇరిగేషన్ వార్ !

image

నువ్వు దోచుకున్నావంటే.. నువ్వే ఎక్కువ దోచుకున్నావంటూ పరస్పరం కాకాణి, సోమిరెడ్డి విమర్శించుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇరిగేషన్ పనుల అవినీతే లేవనెత్తుతున్నారు. కనుపూరు కాలువ, కండలేరు స్పిల్ వే, సర్వేపల్లి కాలువ, చెరువు షట్టర్ పనులపై విమర్శించుకుంటున్నారు తప్పితే.. ప్రజలు కష్టాలను గాలికొదిలేస్తున్నారన్నా అపవాదు నెలకొంది.