News November 29, 2025

కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

Similar News

News December 5, 2025

రేపు వాయిదా పడిన డిగ్రీ పరీక్ష నిర్వహణ

image

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో డిసెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష తుఫాను కారణంగా వాయిదా పడింది. ఆరోజు జరగాల్సిన పరీక్ష ఈ నెల 6న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రతి విద్యార్థి పరీక్షకు తప్పక హాజరు కావాలన్నారు.

News December 5, 2025

కడప జిల్లా రైతు సూసైడ్..!

image

సింహాద్రిపురం మండలం బలపనూరులో శుక్రవారం ఓ వేప చెట్టుకు ఉరి వేసుకుని రైతు నాగేశ్వర రెడ్డి (63) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తన రెండు ఎకరాల పొలంలో పంటలు పండక అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు అధికం కావడంతోపాటు తన భార్య అనారోగ్యంతో బెంగళూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో మనస్థాపం చెందిన నాగేశ్వర రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News December 5, 2025

కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

image

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్‌లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్‌లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.