News April 18, 2024

TODAY HEADLINES

image

➣కాంగ్రెస్ ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.5వేలు వచ్చేది: PM
➣AP:జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం: CBN
➣వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్
➣TG:వచ్చే ఇరవై ఏళ్లు రాహులే ప్రధాని: సీఎం రేవంత్
➣ఎన్నికలు పూర్తయ్యాక హామీలు నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
➣ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మిస్తాం: కిషన్ రెడ్డి
➣నేను పార్టీ మారుతా అనే వారిని చెప్పుతో కొడతా: హరీశ్ రావు
➣IPL:గుజరాత్‌పై ఢిల్లీ విజయం

Similar News

News October 13, 2024

నితీశ్ కుమార్ విజయం వెనుక తండ్రి త్యాగం

image

తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ నేడు భారత క్రికెటరయ్యారు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగమే తన ఎదుగుదలకు పెట్టుబడైంది. ‘నేను జాబ్ చేసే సంస్థ రాజస్థాన్‌కు మారింది. దాంతో నితీశ్ క్రికెట్‌కి ఇబ్బంది అని ఆ జాబ్ మానేశాను. ఆర్థికంగా బాగా కష్టపడ్డాం. అందరూ ఎన్నో మాటలు అన్నారు. నితీశ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తే చాలనుకున్నాను. కానీ ఏకంగా భారత్‌కు ఆడుతున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో మురిసిపోయారు ఆ తండ్రి.

News October 13, 2024

కాంగ్రెస్ నేతల్ని రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR

image

తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరని KTR ప్రశ్నించారు. ‘ఇటీవల ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగాయి. రూ.100 కోట్లు దొరికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీ, ఈడీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వాల్మీకి స్కామ్‌లోని రూ.40 కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో వాడిందని కర్ణాటకలో ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టులు లేవు’ అని చురకలంటించారు.

News October 13, 2024

టన్ను ఇసుక రూ.475కే ఇచ్చావా?.. ఎవరికిచ్చావ్?: టీడీపీ

image

AP: ఇసుక గురించి, మద్యం గురించి <<14349346>>జగన్<<>> ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని TDP కౌంటర్ ఇచ్చింది. ‘నీ ప్రభుత్వం 20 టన్నుల లారీ రూ.30వేల నుంచి రూ.40వేలకు అమ్మితే మా ప్రభుత్వంలో రూ.16వేల నుంచి రూ.18వేలకు కేవలం రవాణా ఛార్జీలతో వస్తుంది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి వందల మంది ఆత్మహత్యకు కారణమయ్యావ్. టన్ను రూ.475కే ఇచ్చావా? ఎవరికిచ్చావ్?’ అని ఫైరయింది.